టాలివుడ్ స్టార్ హీరోతో నటించాలని ఆశ పడుతున్న లైగర్ భామ?

ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు వరుసగా హిట్ అవుతూ మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలువైపులా తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లు మన టాలీవుడ్ దర్శకులు, హీరోలతో కలిసి పని చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా తాజాగా విడుదలైన కార్తికేయ2, సీతారామం సినిమాల ప్రభావం కూడా బాలీవుడ్ మీద బాగా ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో కలిసి నటించటానికి బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మన తెలుగు హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కె సినిమా ద్వారా దీపికా పదుకొనే టాలీవుడ్ కి పరిచయం కానుంది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ద్వారా అనన్య పాండే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆగస్ట్ 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటించిన సినిమా బృందం ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మాట్లాడుతు తనకు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని అతనితో కలిసి నటించాలని ఆశపడుతున్నట్లు వెల్లడించింది. తెలుగు ప్రేక్షకులు తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు చాలా నచ్చాయని వెల్లడించింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. లైగర్ సినిమా హిట్ అయితే అనన్యకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ కూడా పిలిచి మరీ అవకాశం ఇవ్వటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తాయో చూడాలి మరి.