పూరీ జగన్నాథ్ పరువు తీద్దాం పదండి..బహిరంగ లేఖ రాసిన అభిమాని.. వైరల్ అవుతున్న పోస్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. ఆ సినిమాలలో నటించిన హీరోలను సార్ హీరోలుగా మారారు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకతవం వహించిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యయి. అలా ప్లాప్ అయిన వారిలో లైగర్ సినిమా కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలు తారు మారు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా వల్ల నిర్మాతలతో పాటు , డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా నష్టపోయారు. లైగర్‌ ఫ్లాప్‌తో తమకు కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్‌ పూరీని డిమాండ్‌ చేయగా.. ఆయన కొంత గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌ ఆయన ఆఫీసు ముందు ధర్నా చేసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చి ఆయన పరువు తీయాలని కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్ల మీద ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా పూరి జగన్నాథ్ అభిమాని రాసిన బహిరంగ లేక ఇప్పుడు చర్చనీయంగా మారింది.

పూరి జగన్నాథ్ ని బెదిరించి ఆయన పరువు తీయాలని చూస్తున్నా వారిని అడ్డుపెట్టుకొని పూరీ అభిమాని లేఖ రాసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ లేఖలో… అవును పూరి జగన్నాథ్ అని డాషింగ్ డైరెక్టర్ పరువు తీద్దాం పదండి. ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించిన పూరి ఒక మోసగాడు. సినిమాలు తీసి దర్శకుడిగా నిర్మాతగా వందల కోట్లు నష్టపోయిన కూడా ఆస్తులు అమ్మి అందరి అప్పులు తీర్చిన పూరి జగన్నాథ్ పరువు తీయాల్సిందే. సినిమాలలో నష్టపోయిన కూడా ఎవరిని బాధ్యుల్ని చేయకుండా లాభాలు వస్తే రూపాయి ఆశించకుండా ఉన్నందుకు పూరీ జగన్నాథ్ పరువు కచ్చితంగా తీయాల్సిందే అంటూ.. బహిరంగ లేఖ రాసి పూరి జగన్నాథ్ కి మద్దతు పలుకుతూ ఆయన విషయంలో కుట్ర పన్నుతున్న వారి పట్ల ఆసనం వ్యక్తం చేశాడు.