ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఒక అన్ రియల్ క్రేజ్ లో ఉన్నటువంటి భారీ చిత్రాల రిలీజ్ లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం మొదట అనుకున్న టైం కి రిలీజ్ అవ్వాల్సి ఉంటే ఎన్నో వండర్స్ ని సెట్ చేసి ఉండేది.
దీనితో దీని ప్లేస్ లోకి అయితే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన “లియో” చేరింది. గత ఏడాది నుంచి యూఎస్ మార్కెట్ లో అయితే రిలీజ్ కి ముందే 1 మిలియన్ డాలర్స్ అందుకున్న సినిమాలు RRR తర్వాత మరొకటి లేదు. దీనితో ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఈ భారీ ఫీట్ ని అందుకున్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇప్పుడు లియో నిలిచింది అని అక్కడి ట్రేడ్ చెప్తుంది.
అయితే ఇది ఖచ్చితంగా మన తెలుగు హీరో మిస్ చేసుకున్న రికార్డు అని చెప్పాలి. సలార్ కి అయితే లియో ని మించి ఎన్నో రెట్లు క్రేజ్ వచ్చేసింది. నెలన్నర రోజులకి ముందే 7 లక్షల మేర డాలర్స్ వసూలు చేసింది ఈ చిత్రం. కానీ అనూహ్యంగా షోస్ క్యాన్సిల్ చేయడం డబ్బులు అన్నీ వెనక్కి ఇచ్చేయడంతో అంతా మారిపోయింది.
లేకపోతే సలార్ సినిమాకి 1 మిలియన్ ఏంటి 2 మిలియన్ కూడా వచ్చేవి అని అంతేందుకు ప్రీమియర్స్ లో RRR రికార్డుని కొట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు తెలిపారు. దీనితో సలార్ మిస్ చేసుకున్న ఛాన్స్ అయితే లియో దక్కించుకుంది.