“లియో” ఫస్ట్ వీక్ రికార్డ్స్ ఓకే..కానీ డిస్ట్రిబ్యూటర్స్ అలా చెప్తున్నారేంటి?

తమిళ సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న పలువురు స్టార్ హీరోస్ లో ఇప్పుడు తమిళ సినిమాని ఏలుతుంది మాత్రం దళపతి విజయ్ ఒక్కడే అని చెప్పాలి. ఒకదాని తర్వాత ఒకటి భారీ సక్సెస్ లతో తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాలను ఒకదానిని ఇంకో దానితో కొడుతూ సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

అయితే విజయ్ సినిమాల వసూళ్ల విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఏదొక కాంట్రవర్సీ మాత్రం వస్తూనే ఉంటుంది. ఆ వసూళ్లు ఫేక్ అని నిర్మాతలు రికార్డ్స్ కోసం భారీ నంబర్స్ అనౌన్స్ చేస్తున్నారు కానీ రియాలిటీ లో అంత రావడం లేదు అని అంటారు.

మరి ఇప్పుడు లియో చిత్రానికి మొదటి వారం అయితే ఏకంగా 460 కోట్లకి పైగా గ్రాస్ అందుకుని కోలీవుడ్ హిస్టరీ లోనే ఒక భారీ రికార్డుని సెట్ చేసినట్టుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే అసలు ఈ చిత్రానికి తమిళ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అలాంటిది ఏమి లేదని నిర్మాతలే కావాలని ఇలా నంబర్స్ చెప్తున్నారు అని కానీ ఇక్కడ వసూళ్లు మాత్రం అంతగా రావడం లేదు అని చెప్తున్నారు.

అయ్యితే వరల్డ్ వైడ్ ఏమో కానీ తమిళ నాట లియో పరిస్థితి ఇలాగే ఉందట. ప్రపంచ వ్యాప్తంగా ఇంత వసూళ్లు అందుకుంటున్నా కూడా ఇంకా తమిళ నాట జరిగిన బిజినెస్ కి మొత్తం రికవర్ కాలేదు అని అంటున్నారు. దీనితో లియో వసూళ్లులో మాత్రం ఏదో జిమ్మిక్ ఉందనే అనిపిస్తుంది.