బిగ్ న్యూస్ : తన చివరి సినిమాపై అందరికీ షాకిచ్చిన విజయ్ దళపతి.!

తమిళ సినిమా నాట అలాగే తెలుగులో కూడా మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోస్ లో దళపతి విజయ్ కూడా ఒకడు. విజయ్ ఇప్పుడు చేస్తున్న ఒకో సినిమా పై హైప్ వేరే లెవెల్ కి వెళ్తుంది. అలాంటి “లియో” సినిమా జస్ట్ యావరేజ్ టాక్ తో కూడా విజయ్ ఏకంగా 600 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి తన స్టార్డం మరింత పెంచుకున్నాడు.

ఇపుడు తన కెరీర్ లో 68వ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ని దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తుండగా తన నుంచి ఇదే లాస్ట్ సినిమా అంటూ ఆ మధ్య టాక్ వచ్చింది. దీని తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు కూడా వచ్చాయి. కాగా ఇప్పుడు తన చివరి సినిమా విషయంలో ఫ్యాన్స్ కి విజయ్ బిగ్ షాక్ ఇచ్చాడు.

తాను ఇప్పుడు చేస్తున్న సినిమా ఆ తర్వాత కేవలం మరొక్క సినిమా మాత్రమే చేసి సినిమాలు ఆపేస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా ఒక కొత్త పొలిటికల్ పార్టీ ని తాను అనౌన్స్ చేసి తాను 69వ సినిమా చేసిన తర్వాత సినిమాలు ఆపేస్తున్నాను అని ఇక మీద రాజకీయాల్లోనే కొనసాగుతాను అని చేసిన అనౌన్సమెంట్ షాకింగ్ గా మారింది.

విజయ్ ఇప్పుడు వేరే లెవెల్ స్టేజ్ లో సినిమాల పరంగా ఉండడంతో ఫ్యాన్స్ కి కూడా ఈ నిర్ణయం ఒకింత బాధాకరంగా ఉంది. దీనితో తమ హీరో రాజకీయాల్లోకి వస్తున్నాడు అని ఆనందపడేవాళ్ళతో పాటుగా సినిమాలు ఆపేస్తున్నాడని బాధ కూడా చాలా మందిలో ఉంది. కాగా ఇప్పుడు తన లాస్ట్ సినిమా ఏంటి అనే దాని విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.