లేటెస్ట్ : మరో ఊహించని కాంబినేషన్ తో కమల్ భారీ సినిమా.!

తమిళ సినిమా విలక్షణ నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాను “విక్రమ్” సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాక తాను మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. ఆ సినిమా తర్వాత శంకర్ మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులతో భారీ సినిమాలు చేస్తున్న కమల్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా తన కెరీర్ లో మరో సినిమాని అనౌన్స్ చేసేసారు.

అయితే ఇది కూడా ఒక ఊహించని కాంబినేషన్ అని చెప్పాలి. కాగా కమల్ హాసన్ కెరీర్ లో 237వ చిత్రంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ లు అన్బరివ్ లు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్టుగా కమల్ హాసన్ ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ తో రివీల్ చేశారు. మరి ఈ ఇద్దరు ఇప్పటివరకు విక్రమ్, కేజీఎఫ్ 1 మరియు 2, అలాగే లియో, లేటెస్ట్ గా సలార్ ఇలా ఎన్నో క్రేజీ చిత్రాలకి ఒక సరికొత్త ఏక్షన్ ని చూపించి అదరగొట్టి ఇండియాలోనే ఇపుడు మోస్ట్ పైడ్ ఫైట్ మాస్టర్స్ గా నిలిచారు.

కాగా ఇప్పుడు వీరు దర్శకులుగా మారి కమల్ హాసన్ నే ఒక ఫుల్ ఏక్షన్ ప్రాజెక్ట్ లో డైరెక్ట్ చేయబోతున్నారు. దీనితో ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ని కమల్ హాసన్ కూడా సగర్వంగా అనౌన్స్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఈ ఊహించని కాంబినేషన్ ని ఎవరూ ఊహించలేదు. కాగా కమల్ హాసన్ నటించిన చిత్రం ఇండియన్ 2 చిత్రీకరణ కంప్లీట్ చేసుకోగా మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.