లావణ్య త్రిపాఠి ని ఆ మాట అడిగితే ఛీఛీ.. నోనో అనేసిందట ..!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాటికి టాలీవుడ్ లో మంచి క్రేజే ఉంది. తను నటించిన సినిమాలలో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, అర్జున్ సురవరం, దూసుకెళ్తా, శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్స్ ఉన్నాయి. ఇక మిగతా సినిమాలలో ను హీరోయున్ గా లావణ్య కి మంచి పేరే వచ్చింది. అంతేకాదు లావణ్య త్రిపాఠి నటించిన మొదటి సినిమా అందాల రాక్షసి సినిమాలో నటనకి గాను దర్శక ధీరుడు రాజమౌళి లాంటి వాళ్ళ నుంచి ప్రశంసలను అందుకుంది. కెరీర్ ని చాలా బ్యాలెన్స్డ్ గా కొనసాగిస్తున్న లావణ్య ఏ సినిమాలోనూ హద్దులు దాటి నటించలేదు.

Arjun Suravaram review: Nikhil impresses audiences, bags the much-needed  hit - IBTimes India

అలాంటి సినిమాలకి భారీ రెమ్యూనరేషన్ ఇస్తామంటే కూడా ఆసక్తి చూపించకుండా సున్నితంగా తిరస్కరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో యంగ్ హీరోల తో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోలతోనూ నటించిన లావణ్య కి మధ్య మధ్యలో తమిళ సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. కాగా లావణ్య కి ఉన్న క్రేజ్ వల్ల ఒక లిక్కర్ బ్రాండ్ కి ప్రచారకర్త గా ఆఫర్ వచ్చిందట. కాని అలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం లావణ్య కి ఇష్టం లేదని నిర్మొహమాటంగా నో చెప్పిందట. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా లావణ్య ఆలోచించకుండా నో చెప్పినందుకు అభిమానులు లావణ్య మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం లావణ్య నటిస్తున్న సినిమాల విషయానికొస్తే యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఏ 1 ఎక్స్‌ప్రెస్ అన్న సినిమా చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే మరో యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న చావు కబురు చల్లగా అన్న సినిమా చేస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు.