తెలుగులో మరొక స్పోర్ట్స్ డ్రామా..

Another sports dram in Tollywood

Another sports dram in Tollywood

టాలీవుడ్లో స్పోర్ట్స్ డ్రామాలా హవా కొనసాగుతోంది. ఇప్పటికే ‘జెర్సీ, ఏ 1 ఎక్స్ ప్రెస్’ లాంటి సినిమాలు రాగా త్వరలో ఇంకొన్ని సినిమాలు కూడ రానున్నాయి. 24వ వరల్డ్ కబడ్డీ డే కావడంతో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘అర్జున్ చక్రవర్తి’ ఫస్ట్ లుక్ రీలీజ్ చేశారు. ఈ సినిమా పూర్తిస్థాయి స్ప్రార్ట్స్ డ్రామా. మన దేశంలో కబడ్డీ అనేది పేరున్న క్రీడ. మన వాళ్లకు అలాంటి సినిమాల మీద ఆసక్తి కూడ ఎక్కువే. అందుకే కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి లైఫ్ ఆధారంగా ఒక సినిమాను తీస్తున్నారు.

ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే ట్రోపీలు, మెడల్స్, కబడ్డీ జెర్సీలతో, ఎమోషనల్ డైలాగులతో, మంచి నేపథ్య సంగీతంతో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో మెయిన్ లీడ్ కొత్త కుర్రాడు విజయరామరాజు చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను చాలా కష్టపడ్డాడట. ఇందులో కథానాయకిగా సిజ రోజ్ నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకో రెండు భాషల్లో చిత్రం డబ్ కానుంది. శ్రీను గుబ్బల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వేణు కేసి డైరెక్ట్ చేస్తున్నారు.