క‌ళ్ల‌జోడు, గడ్డంతో న్యూ లుక్ లో అల్లు అర్జున్..ఫొటోలు వైరల్

చేసినవి కొన్ని చిత్రాలైనా తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. కేరళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. అతడే అల్లు నటవారసుడు అల్లు అర్జున్.

Image

ఇదిలా ఉంటే ,ప్రస్తుతం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కు సంబంధించిన ప‌లు ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. కొత్త సినిమా ‘చావు కబురు చల్లగా’ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శరత్‌ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ త‌న తండ్రి అల్లు అరవింద్‌, సోద‌రుడు అల్లు శిరీష్‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు. శ‌ర‌త్ చంద్ర‌తో కేక్‌ కట్‌ చేయించి, ఆయ‌న‌కు తినిపించాడు.

అల్లు అర్జున్ క‌ళ్ల‌జోడు పెట్టి, గెడ్డం పెంచి కొత్త లుక్‌లో క‌న‌ప‌డుతుండ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది. త‌న చొక్కా పైగుండీలు తీసి ఆయ‌న ఎన్న‌డూ లేని విధంగా క‌న‌ప‌డుతూ బ‌ర్త్ డే పార్టీలో హంగామా చేశాడు. కాగా, కార్తికేయ, లావ‌ణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా ఈ నెల‌ 19న విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు.