బిగ్గెస్ట్ అప్డేట్ : బాలయ్య మాసివ్ హంట్ టీజర్ కి సమయం ఖరారు.!

లేటెస్ట్ గా నందమూరి వారి మాసెస్ట్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం తన కెరీర్ లో 107వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి రేపు బాలయ్య బర్త్ డే కానుకగా చిత్ర బృందం ఒక భారీ ట్రీట్ మాత్రం ఉంటుంది అన్ని టీజ్ చేసారు.

అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ ఆ శాలి అనౌన్సమెంట్ ని అందించారు. ఈ సినిమా ఫస్ట్ హంట్ అంటూ ఈరోజు ఒక క్రేజీ మాస్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా సమయాన్ని ఖరారు చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకి ఈ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అయితే ఇది కంప్లీట్ మాస్ గా ఉండగా దీనిపై రిలీజ్ చేసిన పోస్టర్ మంచి పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య కోసం ఒక ప్రత్యేక ఆయుధం డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే జస్ట్ ఈ అనౌన్సమెంట్ తో భారీ అంచనాలు ఒక్కసారిగా రేగాయి.

అయితే సాయంత్రం వచ్చే ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం వహించారు.