ఇండస్ట్రీ టాక్ : “NBK 107” టైటిల్ రిలీజ్..ఇతర లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ లో 107వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. మరి దీనిపై కూడా మాస్ లో మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు టర్కీ లో సినిమా షూటింగ్ ని చేస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అక్కడ ఆల్ మోస్ట్ కంప్లీట్ కావచ్చి రాగ ఇంకా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ లు ఇపుడు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి ఈ టైటిల్ ని అయితే దసరా మహోత్సవం సందర్భంగా టీజర్ తో పాటు ఈ టైటిల్ ని తెలుపుతారట. అంతే కాకుండా సినిమా డిసెంబర్ నాటికి మొత్తం రెడీ అయిపోతుండగా దీనితో పాటుగా సినిమా రిలీజ్ విషయంలో మాత్రం మార్పులు ఉండొచ్చని అంటున్నారు.

మొదట ఈ సినిమాని కూడా సంక్రాంతి రేస్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయగా ఇప్పుడు అక్కడ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. కానీ జనవరిలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.