గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన సెన్సేషనల్ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గానే హైదరాబాద్ ఇర్రమంజిల్ లో వేసిన భారీ సెట్టింగ్స్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా పవన్ పోలీస్ గెటప్ లో అలాగే పోలీస్ స్టేషన్ సెట్టింగ్స్ లో సాలిడ్ షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు.
మరి ఈ సినిమాపై అయితే ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్ నుంచి లేటెస్ట్ గా ఓ భారీ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. పవన్ పి ఆర్ నుంచే ఈ అప్డేట్ రావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా అయితే కంప్లీట్ అయ్యింది అని అలాగే ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. మరియు పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
నాయిక శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఇక ఈ మొదటి షెడ్యూల్ అవుట్ పుట్ విషయంలో మేకర్స్ కూడా పాజిటివ్ గా ఉన్నారట. మొత్తానికి అయితే ఉస్తాద్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతున్నాడు.
* పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి షెడ్యూల్ పూర్తి
*యాక్షన్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాల చిత్రీకరణపవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చేతులు కలిపారు. ప్రముఖ… pic.twitter.com/xlDjZv7JmD
— L.VENUGOPAL🌞 (@venupro) April 15, 2023
