ఇండస్ట్రీ టాక్ : ‘RC15’ కి అదిరిపోయే సరికొత్త టైటిల్.!

మ్యాన్ ఆఫ్ మాసెస్, మెగాపవర్ స్టార్ లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ గా పలు టాగ్స్ సొంతం చేసుకున్న మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పలు భారీ సినిమాలు అలాగే తన లాస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ సక్సెస్ తో మరింత ఫేమ్ ని తాను సొంతం చేసుకున్నాడు.

అయితే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే దర్శకుడు శంకర్ లాంటి వారితో నటించిన  హీరోగా రామ్ చరణ్ నిలవగా ఇప్పుడు శంకర్ తో చేస్తున్న సినిమాపై ఇప్పుడు ఎనలేని ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాకి గతంలో సిటిజన్, సర్కారోడు, సేనాని, సేనాపతి లాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయి.

కానీ ఇప్పుడు వచ్చిన మరో లేటెస్ట్ టైటిల్ దాదాపు ఖరారు అయ్యిపోయింది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఈ కొత్త టైటిల్ ఏమిటంటే “సిఈఓ” అట. అయితే ఇది బిజినెస్ మెన్ టైప్ టైటిల్ కాదు పక్కా శంకర్ మార్క్ లో ఉండే టైటిల్ అని తెలుస్తుంది. దీనితో ఈ సరికొత్త టైటిల్ కి ఇంట్రెస్టింగ్ గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు వ్యాపిస్తుంది.

కాగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అయితే ఈ నెలలో చరణ్ బర్త్ డే కానుకగా రివీల్ కానున్నాయి. అప్పుడు ఇదే టైటిల్ వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ ప్లానింగ్ లో ఉంది.