గాసిప్స్..”బాలయ్య 109″ కోసం అదిరే హీరోయిన్.?

ప్రస్తుతం టాలీవుడ్ గ్లోబల్ లయన్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అయితే “భగవంత్ కేసరి” అనే సాలిడ్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రం అనంతరం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా అయితే మరో కంప్లీట్ యాక్షన్ ఫ్లిక్ ని దర్శకుడు బాబీ కొల్లి తో ప్లాన్ చేయగా దీనిపై కూడా క్రేజీ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ బజ్ ఒకటి ఇపుడు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అయ్యితే మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే సంగీత దర్శకునిగా కూడా దేవిశ్రీ ప్రసాద్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అన్నట్టు కూడా టాక్. ఇక ఈ చిత్రాన్ని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కి రానుంది.

మరి లేటెస్ట్ గా అయితే తమన్నా మరో పక్క మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ స్టార్ తో కూడా భోళా శంకర్ అనే మాస్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాజల్ తర్వాత బాలయ్య తమన్నా తో మొదటి సారి సినిమా చేస్తున్నారని చెప్పాలి. ఒకవేళ ఓకే అయితే.