బిగ్ బాస్ షోలోకి వచ్చాక లాస్య గురించి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం, ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక కూడా లాస్య సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది. తనకు పెరిగిన ఇమేజ్‌ను లాస్య బాగానే వాడుకుంటూ వచ్చింది. యూట్యూబ్ చానెల్‌ను లాస్య తెలివిగా వాడేసుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫ్యామిలీని ఇంటర్వ్యూలు చేస్తూ బాగానే ట్రెండ్ అయింది.
అయితే తాజాగా లాస్య లైవ్‌లోకి వచ్చింది. తన అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ ముచ్చట్లు, జున్ను, మంజునాథ్‌లకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురయ్యాయి. అయితే కొందరు మాత్రం లాస్య మేకప్ గురించి ప్రశ్నించారు. అలాగే వెయిట్ లాస్‌కు సంబంధించిన చిట్కాలు, స్కిన్ కేర్‌కు సంబంధించిన రహస్యాలు చెప్పమని అడిగారు.
ఇందులో వెయిట్ లాస్ గురించి లాస్య మాట్లాడింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక.. టీవీలో తనది తాను చూసుకుంటే చీ ఇలా ఉన్నానేంటి అని అనిపించింది.. మరీ అంత లావుగా కనిపిస్తున్నానా? అని అనుకున్నాను. అందుకే వర్కవుట్లు చేయడం ప్రారంభించాను. వెయిట్ లాస్ అయినట్టు ఏమైనా కనిపిస్తుందా? అని లాస్య నెటిజన్లు అడిగింది. చాలా తగ్గారు అంటూ లాస్య నెటిజన్లు బదులిచ్చారు.