ప్రభాస్ ఫ్యాన్స్ కి లాస్ట్ మినిట్ డిజప్పాయింట్ వార్తలు..!

ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ మళ్ళీ చాలా కాలం తర్వాత ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్”. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించారు. దీనితో ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై ఒక్కరిగా వేరే లెవెల్ హైప్ స్టార్ట్ కాగా..

ఈ చిత్రం నుంచి ఇపుడు ఇండియా వైడ్ గా అంత ప్రమోషన్స్ కూడా కనిపించడం లేదు. దీనితో కీలకమైన సమయంలోనే ఇలాంటి డిజాస్టరస్ ప్లానింగ్ లో సినిమా మేకర్స్ ఉన్నారు. సరే ఇది పక్కన పెడితే హైప్ తేవడానికి రాజమౌళితో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అలానే రెండో ట్రైలర్ అంటూ ఇంకో అప్డేట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే వీటిని నిజానికి ఈరోజే రిలీజ్ చేయాల్సింది కానీ ఇపుడు లాస్ట్ మినిట్ లో రెండిటిని కూడా మేకర్స్ వాయిడా వేసినట్టుగా కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. ట్రైలర్ రాకపోయినా ఫుల్ ఇంటర్వ్యూ చూద్దాం అనుకున్నవారికి డబుల్ డిజప్పాయింట్మెంట్ నే మేకర్స్ మిగిల్చారు అని చెప్పక తప్పదు.

ఇప్పటికే ఉన్న హైప్ ని చెడగొట్టుకున్నారని ఓ టాక్ ఉంది. ఇపుడు మళ్ళీ అలాంటిది ఇంకా ఆలస్యం చేస్తూ రావడం ఫ్యాన్స్ లో ఓపికని మరింత తగ్గిస్తుంది అని చెప్పక తప్పదు. మరి ఇలాంటివి అన్ని చేస్తూ వస్తే లాస్ట్ చేసి సినిమాకి వచ్చే మినిమమ్ ఓపెనింగ్స్ పై చాలా ప్రభావం చూపిస్తుంది.