లాస్ట్ మినిట్ ఛేంజ్..మహేష్ సినిమాకి మరో క్రేజీ ప్లానింగ్.!

ఇప్పుడు టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ల కాంబోలో సినిమా కూడా ఒకటి. ఇక ఈ మే చివరన అయితే బ్లాస్టింగ్ ట్రీట్ గా ఓ టీజర్ ని అయితే మేకర్స్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి ఈ ట్రీట్ తో పాటుగా చాలా కాలం నుంచి టైటిల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. అయితే తాజా మేకర్స్ రెండు టైటిల్స్ “అమరావతికి అటు ఇటు” తర్వాత “గుంటూరు కారం” అనే టైటిల్స్ ని చూస్తుండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్లాన్ ని లాస్ట్ మినిట్ లో మేకర్స్ చేస్తున్నారట.

అయితే ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ పాత చిత్రం టైటిల్ ఒకటి ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. అదే “ఊరికి మొనగాడు” అట. కాగా ఈ టైటిల్ లాస్ట్ మినిట్ లో పరిశీలనకు రాగా ఇప్పుడు ఈ మూడు టైటిల్స్ అయితే ఇప్పుడు ఆన్ లో ఉన్నాయట. దీనితో లాస్ట్ గా అయితే ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి మరి.

కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల అలాగే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.