మొదటిసారి ద్విపాత్రాభినయంలో నటిస్తున్న కృతి శెట్టి.. ఫ్లాప్ లతోతో డేరింగ్ స్టెప్ తీసుకున్న బేబమ్మ?

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నటిగా వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా మొదటి సినిమా మంచి హిట్ కావడంతో అనంతరం నాని సరసన నటించిన శ్యామ్ సింగరాయ్,నాగచైతన్య సరసన నటించిన బంగార్రాజు సినిమాలు హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇకపోతే కృతి శెట్టి తర్వాత నటించిన దివారియ మాచర్ల నియోజకవర్గం సినిమాలు తనని తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ఈ విధంగా ఈ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కృతి శెట్టి తన సినిమా కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఎప్పుడు ప్రేమ కథ చిత్రాలు మాత్రమే కాకుండా విభిన్న పాత్రలలో నటించడానికి ఈమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రంలో ఈమె నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.

ఈ సినిమాత్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అయితే తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటిసారి ఈమె ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించబోతుందని సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టి ఒక పాత్రలో నాగచైతన్య లవర్ గాను మరో పాత్రలో ప్రేతాత్మ నటించడానికి ఈమె సిద్దమైనట్లు సమాచారం. ఇలా ప్రేతాత్మగా ఈమె మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రాబోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.