కృతి శెట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ.?

బేబమ్మ కృతి శెట్టికి స్టార్ డమ్ దక్కినట్లే దక్కి దూరమైపోయింది. అయినా కానీ, బేబమ్మతో ఏమాత్రం ఢీలా పడడం లేదు. ఎందుకంటే ఆమెలో విజయముంది మరి. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తినేసింది కృతి శెట్టి. అందుకు పూర్తి కారణం కృతి శెట్టి ఎంత మాత్రమూ కాదనుకోండి.

ఆమె ఎంచుకున్న కథలే కారణం. డైరెక్టర్ల పనితనం కారణం. ఇలా రకరకాల కారణాలుండొచ్చు. కృతి శెట్టి నటించిన రీసెంట్ మూవీ ‘కస్టడీ’ తీసుకుంటే.. కేవలం గ్లామర్ కోసమే కృతి శెట్టి ఈ పాత్రను ఎంచుకోలేదనిపిస్తోంది.

ఈ సినిమాలో రేవతిగా కృతి శెట్టి పాత్రకు గత చిత్రాలతో పోల్చితే మంచి ప్రాధాన్యత దక్కిందనే చెప్పొచ్చు. అయితే, సినిమా హిట్ అయ్యి వుంటే బాగుండేది. అలా కాకపోవడంతో, పాపం కృతి శెట్టిపై నింద పడిపోయింది. ఈ సినిమాలో కృతి శెట్టి పనితనం చాలా చాలా బాగుందంటూ ఓటీటీలో ‘కస్టడీ’ మూవీ చూసిన ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

నిజానికి కృతి శెట్టిలోని టాలెంట్‌ని వెంకట్ ప్రభు గుర్తించాడనే చెప్పాలి. అందుకే కృతి శెట్టితో ఆయన ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడనీ తెలుస్తోంది. హీరో లేకుండానే హీరోయిన్ సెంట్రిక్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట కృతి శెట్టితో వెంకట్ ప్రభు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.