నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించి తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించి ఒకానొక దశలో తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.కృష్ణ గారు ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు,కృష్ణ అభిమానులు,తెలుగు ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయి కృష్ణ గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటారు.సూపర్ స్టార్ కృష్ణ గారి జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని గురించి ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు
సూపర్ స్టార్ కృష్ణ సినిమా అభివృద్ధి కోసం పద్మలయ స్టూడియోను నిర్మించి ఎన్నో సదుపాయాలు కల్పించి సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు కృష్ణ గారు ఓ రోజు తిరుపతికి దైవదర్శనానికి వెళ్లి
దేవుడికి తలనీలాలు సమర్పించి తిరిగి వస్తుండగా తన కారు చెడిపోయిందట. ఆ సమయంలో కృష్ణ గారి స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు.దాంతో ఏం చేయాలో తెలియక కారు దిగి నడుచుకుంటూ స్టూడియో ఇక్కడే దగ్గరే ఉంది కదా అంటూ వెళ్లారట. కానీ కృష్ణ గారు స్టూడియోకి నడుచుకుంటూ వెళ్తుండగాఎవరు మీరు అంటూ ఆయనను అక్కడే ఆపేసారట వాచ్ మెన్.
కృష్ణ గారు స్టూడియోకి ఎప్పుడు వచ్చినా కారులోనే వచ్చేవారు కాబట్టి పైగా తలనీలాలు సమర్పించడంతో కృష్ణ గారిని వాచ్ మెన్ గుర్తుపట్టలేకపోయారు. అందులో ఆ వాచ్మెన్ కు తెలుగు సరిగా రాకపోవడంతో కృష్ణ గారు చెప్పే విషయం అర్థం కాక దాదాపు రెండు గంటలపాటు కృష్ణ గారిని స్టూడియోలోకి అనుమతించలేదట వాచ్ మెన్.కొద్దిసేపు గడిచాక ఆ స్టూడియో మేనేజర్ వచ్చి కృష్ణ గారి గురించి చెప్పేదాకా లోపలికి పంపించలేదట. ఇలా తన సొంత స్టూడియోలోకి వెళ్లడానికే వాచ్ మెన్ నిరాకరించడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ అయ్యింది. కానీ ఆ వాచ్మెన్ పని తీరు, నిజాయితీనీ గుర్తించిన కృష్ణ గారు వాచ్ మెన్ అభినందించారట. అప్పటి ఆసక్తికర విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటూ వైరల్ గా మారింది.