ఇండస్ట్రీ టాక్ : “దేవర” తో కొరటాల మళ్ళీ పుట్టాడా??

ప్రెజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో సెన్సేషనల్ చిత్రం “దేవర” కూడా ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎంతో ఫేమ్ తెచ్చుకున్నాక చేస్తున్న సినిమా ఇది కావడం పైగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకువస్తుండడంతో దీని స్కేల్ ఒక్కసారిగా పెరిగింది.

అయితే దీనికి ముందు దర్శకుడు కొరటాల శివకి ఆచార్య అనే ఊహించని దిగాస్టార్ సినిమా ఉండగా ఈ సినిమా తర్వాత చేస్తున్నప్పటికీ దేవర పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమా కథ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రాసుకోగా దాన్ని ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. దేవర సినిమాని మాత్రం దర్శకుడు కొరటాల శివ చాలా ప్రతిష్టాత్మకంగా పకట్బందీగా తెరకెక్కిస్తున్నడాట. తన గత చిత్రాలు వేరు ఈ సినిమా వేరు అని సినిమా షెడ్యూల్స్ కూడా ముందే ప్రీ ప్లాన్డ్ గా చేసుకుంటూ ఫర్ఫెక్ట్ గా వస్తేనే షూట్ లో దిగుతున్నారట.

దీనితో దేవర సినిమా దర్శకుడు కొరటాల శివకి కూడా ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ అని అందుకే ఈ సినిమాతో దర్శకునిగా మళ్ళీ తాను పుట్టాడని చెప్పొచ్చు. ఇంకా ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, నటుడు సైఫ్ అలీఖాన్ లు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచటం అవుతున్నారు.