“NTR30” కి హాలీవుడ్ మాస్టర్స్ వెనుక కొరటాల గట్టి ప్లాన్.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వెళ్ళుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయ్యిన చిత్రాల్లో మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న సినిమా కూడా ఒకటి.

మరి ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుండగా ఈ సినిమా పక్కా మాస్ అండ్ భారీ ఏక్షన్ డ్రామాగా అయితే తెరకెక్కనుంది. ఐతే ఒకో అప్డేట్ తో ఓ రేంజ్ లో హైప్ లేపుతున్న ఈ సినిమా నుంచి నిన్న రాత్రి ఊహించని అప్డేట్ మేకర్స్ రివీల్ చేశారు.

కాగా ఈ సినిమాకి హాలీవుడ్ ఏక్షన్ మాస్టర్ కెన్నీ బీట్స్ ని రంగంలోకి దింపినట్టుగా తెలపగా సినిమా కేజ్రీగా మారింది. కాగా దీనితో పాటుగా ఈ అప్డేట్ వైరల్ గా మారింది. అయితే లాస్ట్ టైం కెన్నీ బీట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో సినిమాకి వర్క్ చేశారు.

అలాగే హాలీవుడ్ లో అయితే మిషన్ ఇంపాజిబుల్ లాంటి సెన్సేషనల్ సినిమాలకి వర్క్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకురావడం అనేది ఓ రేంజ్ లో హైలైట్ గా మారింది. అయితే దీని వెనుక కొరటాల మాస్టర్ ప్లాన్ ఉండకనే ఉందంట.

ఈ సినిమాకి వారిని తీసుకోవాలి అనేది కొరటాల ఐడియా మాత్రమే అని ఏక్షన్ ఎపిసోడ్స్ ఏమాత్రం తగ్గించకుండా చేయాలని అందుకే ప్రీ ప్రొడక్షన్ లో సినిమా టైం పట్టినప్పటికీ పక్కా ప్లానింగ్ తో చేయాలని తాను ఫిక్స్ అయ్యారట. అందుకే ఇపుడు ఈ అప్డేట్స్ ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొస్తున్నాయి.