ఇలియానాకు బ్యాన్ దెబ్బ!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయిన అందాల భామ ఇలియానా జులాయి సినిమా తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ లో ఉన్న సమయంలోనే ఇక్కడి ప్రాజెక్ట్స్ అన్ని కూడా రిజక్ట్ చేసి హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు బర్ఫీ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో హిందీలో సక్సెస్ కాలేదని చెప్పాలి.

అయితే హిందీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ తో ప్రేమలో పడింది. దీంతో అతని మాయలో ఉండి చేతిలోకి వచ్చిన ప్రాజెక్ట్స్ ని సైతం వదులుకుంటూ వచ్చింది. తరువాత కొంత కాలానికి అతనితో బ్రేక్ అయ్యింది. ఈ సమయంలో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే మరల కోలుకొని తిరిగి సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం అయితే చేస్తుంది. కాని అవకాశాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వడం లేదు.

జులాయి సినిమా తర్వాత చాలా కాలానికి అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో తెలుగులో ఇలియానా నటించింది. అయితే ఆ సినిమా ఆమెకి కెరియర్ పరంగా ఉపయోగపడలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరోయిన్ గా ఆమె కెరియర్ ముగిసిపోయింది అనే చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెపై బ్యాన్ విధించారు అనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ మధ్య ఆమె కోలీవుడ్ లో నిర్మాతకి సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకునదంట. అలాగే కాంట్రాక్ట్ కూడా సైన్ చేసిందంట.

అయితే ఇప్పుడు ఆ సినిమాలో నటించడానికి ఇలియానా ఒప్పుకోవడం లేదని, ఎంత పిలిచినా కూడా షూటింగ్ లో పాల్గొనడం లేదని సదరు నిర్మాత నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసినట్లు టాక్. ఈ నేపధ్యంలో ఇలియానాది తప్పు అని నిర్ధారించిన నిర్మాతల మండలి ఆమె మీద బ్యాన్ విధించినట్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే కెరియర్ ముగిసిపోయిన తర్వాత బ్యాన్ విధించిన ప్రయోజనం ఏమీ ఉండదనే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తుంది.