ఫ్యాన్స్ చేసే సందడి వీడియో కాల్ లో అనుష్కకి చూపిస్తూ సంబరపడిన కోహ్లీ..!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం టీమిండియా రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం వరసగా మ్యాచులు ఆడుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా వరుస మ్యాచ్లో ఉండటం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటూ భార్య పిల్లలను బాగా మిస్ అవుతున్నాడు. ఇటీవల త్రివేండ్రంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా జట్టు త్రివేండ్రం నుండి తిరిగి బస్సులో పయనమయ్యారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బస్సులో వెళ్తుండగా తన భార్య అనుష్కతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు. టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించటంతో అభిమానులు క్రికెటర్స్ వెళ్లే దారిలో రోడ్డుకు రెండు వైపులా నిలబడి తమ అభిమాన క్రికెటర్స్ ని హర్షద్వనుల మధ్య సాగనంపుతున్నారు.

ఈ క్రమంలో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్న కోహ్లీ అభిమానులు చేసే సందడిని వీడియో కాల్ లో అనుష్కకి చూపించాడు. అనుష్కని చూసినా అభిమానులు మరింత ఉత్సాహంగా కేకలు వేశారు. అభిమానులు చేసే సందడి చూసి అనుష్క కోహ్లీ దంపతులు కూడా ఎంతో సంబరపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.