పునీత్ మరణం తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ విడుదల కావడంతో ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి జనని అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో కన్నడ జనని పాటను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Raja Mouli | Telugu Rajyamఈ కార్యక్రమం తర్వాత రాజమౌళి కన్నడ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన రాజమౌళి పునీత్ ను తను 4 సంవత్సరాల క్రితం కలిశానని తను ఎంతో ఆప్యాయంగా పలకరించారని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.ఇలా అందరినీ ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించే పునీత్ ప్రస్తుతం మన మధ్యలేరనే వార్త ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని రాజమౌళి వెల్లడించారు.

ఇక పునీత్ బ్రతికి ఉన్నప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గురించి చాలా మందికి తెలియదు. ఆయన మరణానంతరం తన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు బయటపడటంతో ఆయన గొప్పతనం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి కూడా పునీత్ మరణం తర్వాతనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్నానని, కానీ అతని ఎంతోమందికి సేవ చేసిన ఎప్పుడు ఈ విషయాలను బయట పెట్టలేదని ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ గురించి రాజమౌళి షాకింగ్ కామెంట్ చేశారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles