చరణ్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన కియారా అద్వానీ.!

kiara-1555938036

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ చిత్రాల్లో గ్లోబల్ సక్సెస్ RRR తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న మాసివ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఏక్షన్ డ్రామా చిత్రం “గేమ్ చేంజర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంతోనే దర్శకుడు శంకర్ తన మొదటి టాలీవుడ్ సినిమా చేస్తుండగా భారీ హైప్ అయితే నెలకొంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా కంప్లీట్ అయ్యింది కానీ ఇంకా బాలన్స్ చాలానే ఉంది. అయితే ఈ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ప్రశ్నగా మారగా శంకర్ ఏమో ఇప్పుడు ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేస్తున్న భారీ చిత్రం “ఇండియన్ 2” లో బిజీగా ఉన్నారు.

దీనితో మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి అని చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతుండగా దీనిపై అయితే లేటెస్ట్ గా ఈ సినిమా హీరోయిన్ బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ క్రేజీ అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తాము గేమ్ చేంజర్ షూట్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నామని అలాగే పైగా శంకర్ సర్ ఇపుడు ఇండియన్ 2 ని దాదాపు ఫినిష్ చేయవచ్చారు.

దీనితో ఇక మా సినిమా పైనే తాను ఎక్కువ స్కోప్ పెడతారు అని తెలిపింది. అలాగే ఇంకా మా చిత్రం 80 రోజులు షూటింగ్ బాలన్స్ ఉందని దానిని ఇప్పుడు ఫినిష్ చేసేస్తామని ఆమె చెప్పింది. దీనితో గేమ్ చేంజర్ పై ఇది ప్రస్తుతానికి ఉన్న బిగ్ అప్డేట్.