KGF2 : రాజమౌళి దర్శకత్వం వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల మీద జక్కన్న పెట్టిన శ్రద్ధ.,విడుదలైన రెండు వారాల తరువాత కూడా ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తి తగ్గకుండా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు సినిమా భారీ కలెక్షన్లు సాధించడం లో ఎంతగానో ఉపయోగపడింది..300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండు వారాలలోనే 1000కోట్ల వసూళ్లను సొంతం చేసుకుని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లోనే కాదు కలెక్షన్ లోను రికార్డ్స్ ని తిరగ రాస్తూ ముందుకుపోతుంది.
అమెరికా మీడియా కూడా ఈ సినిమా పట్ల సానుకూలంగా స్పందించింది. న్యూయార్క్ టైమ్స్ తమ సినిమాను ప్రశంసిస్తూ కధనాలు రాయడం విశేషం.ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తర్వాత సినిమా అభిమానులు అంతగా ఎదురు చూస్తున్న సినిమా కేజీఫ్ 2.చాప్టర్1లో ప్రేక్షకుడికి ఒక లెవల్ ఎంటర్టైన్మెంట్ ని చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్., చాప్టర్2 తో అభిమానులలో అంచనాలు పెరిగేలా చేసాడు.అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు విడుదల ముందు ప్రమోషన్ లు భారీ ఎత్తున జరిగాయి. దేశమంతటా ఆర్ ఆర్ ఆర్ టీం చుట్టేసారు, ఎక్కడ చూసిన ఎన్టీఆర్,రామ్ చరణ్, రాజమౌళి ఇంటర్వ్యూ లే కనిపిచ్చేవి.
కానీ kgf2 సినిమా యూనిట్ మాత్రం విడుదలకు వారం రోజులే మిగిలుండగా ఇంకా ప్రమోషన్ లో వేగాన్ని అందుకో లేకపోతుంది. కేజీఫ్ 2 మీద అంచనాలు ఐతే బాగా వున్నాయ్ కానీ ప్రమోషన్ లకు సంబంధించి మాత్రం వారి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనే చెప్పాలి.చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఈ విలువైన సమయాన్ని తన సినిమాకు ఏవిధంగా వాడుకోగలరో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు సినిమా అభిమానులు.