పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయశంకర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు జయశంకర్. ఇక అదే ఊపుతో ఇప్పుడు అరి అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. కాగా సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ మూవీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమాలో భగవద్గీతలోని సారాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. కాగా ఇందులో అనసూయ,సాయికుమార్, శుభలేఖ సుధాకర్ వంటి చాలామంది నటీనటులు నటించారు. ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు చాలా ముఖ్యమని సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ స్పెషల్ చూసినా ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఇకపోతే ప్రేక్షకులకు తాజాగా చిత్ర యూనిట్ ఒక శుభవార్తను తెలిపింది. అదేమిటంటే సినిమా విడుదలకు ముందే ఈ మూవీని వీక్షించేందుకు కొంతమందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్ర యూనిట్. మైథాలజికల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని చెబుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమాను ముందుగానే చూసే అవకాశాన్ని కల్పిస్తోంది చిత్ర యూనిట్.
మామూలుగా సినిమా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తూ ఉంటారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ చాలా ధైర్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాపై ఉన్న నమ్మకంతో డైరెక్టర్ జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారట. ఈ సందర్భంగా డైరెక్టర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలపండి అంటూ వాట్సప్ నంబర్ ను కూడా డైరెక్టర్ జోడించారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. మామూలుగానే కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రేక్షకులలో ఆరాటాన్ని మరింత పెంచేందుకు రిలీజ్ కి ముందే సినిమాను చూపిస్తాం అంటూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.