కే‌జి‌ఎఫ్ 2 అట్టర్ ప్లాప్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఇది ?

కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. యష్ ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా మారాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజమౌళి కి దర్శక ధీరుడిగా బాహుబలి సినిమాలతో ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రశాంత్ నీల్ కి ఒక్క కేజీఎఫ్ ఛాప్టర్ 1 తోనే వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా అన్నీ భాషల్లో కూడా భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాదాపు 350 కోట్లు వసూలు చేయడం అంటే ఇంతటి సక్సస్ ని ఏ ఒక్కరు ఊహించలేదు.

కేవలం కన్నడ పరిశ్రమ నుంచే 120 కోట్లు పైగా వసూలు కాగా హిందీ లో భారీగా వసూళ్ళు రాబట్టింది. బాలీవుడ్ లో డబుల్ సెంచరీ కొట్టేయడం అప్పట్లో గొప్ప సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాకి తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్ళు రాకపోవడం ఆశ్చర్యకరం. ఇలా జరగడానికి తెలుగులో రిలీజ్ విషయంలో గాని ప్రమోషన్ పరంగా గాని మేకర్స్ అంతగా ఆసక్తి చూపించకపోవడమే. ముఖ్యంగా టాలీవుడ్ లో మీడియాకి దూరంగా ఉన్నారు. ఇవ్వాల్సినన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడంతో పెద్దగా సినిమా ప్రమోట్ అవలేదు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి కరెక్ట్ గా సినిమాని ప్రమోట్ చేయలేదు.

అయితే ఇప్పుడు కేజీఎఫ్ ని మించిన క్రేజ్ తో అత్యంత భారీగా రిలీజవుతోంది కేజీఎఫ్ 2. ఈసారి రిలీజ్ చేసే ఛాన్స్ సాయి కొర్రపాటి మిస్సయ్యారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కేజీఎఫ్ ఛాప్టర్ 2 థియేట్రికల్ దక్కించుకుని రిలీజ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్స్ గనక సరిగ్గా జరిగే ఒక స్టార్ హీరో నటించిన స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో కేజీఎఫ్ 2 వసూలు చేయడం పక్కా అంటున్నారు. చూడాలి మరి ఈసారి ఛాప్టర్ 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.