KGF 2 Toofan song : తుఫాన్ తో సరికొత్త రికార్డ్ సృష్టించిన కేజిఎఫ్ 2..!

KGF 2 Toofan song: యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. యష్ నటించిన కేజిఎఫ్ ఎంత భారీ విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే, సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్ 2 మీద కూడా అంచనాలు అంతే రేంజ్ లో ఉన్నాయి. ఇక తూఫాన్ సాంగ్ విడుదల చేసిన తర్వాత యూట్యూబ్ లో ఇక తూఫాన్ మొదలయింది.

రవి బసురుర్ సంగీతం సమాకూర్చిన ఈ మాస్ బీట్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.24 గంటలలో 26మిలియన్ వ్యూస్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. 2 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ లో అదరగోడుతోంది. ఇక ఇండియా లో ఎక్కువ మంది చుసిన లిరికల్ వీడియోగా రికార్డ్ సృష్టించింది.

ఇక కేజీఎఫ్ 2 లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్త్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు.హంబల్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ తో పాటు తెలుగు తమిళ, మలయాళం, హిందీ లలో విడుదలకాబోతోంది.