విలన్ రోల్ కి సంజయ్ దత్ షాకింగ్ రెమ్యూనరేషన్..!

ఈ మధ్య కాలంలో హీరోలకు ఎంత డిమాండ్ ఉంటుందో, విలన్ కి కూడా అంతే డిమాండ్ ఉంటోంది. ఎందుకంటే, స్టార్ హీరోతో పోటీ పడాలంటే, విలన్ కూడా ఆ రేంజ్ వాడే అయ్యి ఉండాలి. అల్లా టప్పా వాళ్లను తెచ్చి పెడితే, చూసే ఆడియన్స్ కి కూడా పెద్దగా కిక్ అనిపించదు. అందుకే, ముందు స్టార్ హీరో సినిమా అనగానే, విలన్ కోసం వెతుకులాట మొదలుపెడుతున్నారు.

అయితే, ఆ విలన్ రోల్స్ కోసం మామూలు వాళ్లని కాకుండా, ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఎదిగినవారినే ఎంచుకుంటున్నారు. మొన్నటి వరకు చాలా మూవీల్లో విలన్ గా జగపతిబాబును తీసుకున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో సంజయ్ దత్ మొయిన్ విలన్ గా మారారు. దాదాపు అందరు స్టార్ హీరోలకు మొయిన్ విలన్ గా సంజయ్ దత్ మారారు.

గతంలో బాలీవుడ్ లో స్టార్ హీరో ఆయన. ఇప్పుడు విలన్ రోల్స్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కేజీఎఫ్ 2 తో విలన్ గా మొదలుపెట్టిన ఆయన, మళ్లీ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. విజయ్ లియో లో విలన్ గా, పూరీ- రామ్ కాంబినేషన్ సినిమాలో కూడా సంజయ్ దత్ నే విలన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, ఇక్కడ మరో ఆసకక్తికర విషయం ఏమిటంటే, విలన్ రోల్ లోనూ ఆయన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. గతంలో హీరోగా ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో, ఇప్పుడు విలన్ గానూ ఆయన అంతే రేంజ్ లో తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన దాదాపు రూ.10కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇంకా అవకాశాలు పెరిగి, డిమాండ్ మరింత పెరిగితే, రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

ఆయన లాంటి స్టార్ హీరో, విలన్ గా మారినప్పుడు ఆ మాత్రం తీసుకోవడంలో తప్పులేదు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సంజయ్ దత్ మూవీలో ఉంటున్నాడు అంటే, ఆ మూవీ పై బజ్ కూడా చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఆ విషయం కూడా సినిమా కు కలిసొచ్చే అంశమే కావడంతో, అందరూ ఆయనను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.