KGF 2 Movie: తుఫాన్’కు ముహూర్తం కరారు… కేజీఎఫ్‌ 2 అంటే మాములుగా ఉండదు…

KGF 2 Movie: ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘కేజీఎఫ్‌’. ఇండియన్ సినీ చ‌రిత్రలోనే అలాంటి ఎలివేష‌న్లు ఏ సినిమాలో చూడ‌లేదు. ప్రశాంత్ నీల్ ఆ ఒక్క చిత్రంతో తానేంటో దేశ వ్యాప్తంగా చాటి చెప్పాడు. రాకింగ్ స్టార్ య‌ష్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకొని అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఎప్పుడెప్పుడు పార్ట్-2 వ‌స్తుందా అని సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు సినీ అభిమానులు ఎదురు చూస్తుండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘తుఫాన్’అంటూ సాగే లిరిక‌ల్ వీడియోసాంగ్‌ను మార్చి 21న ఉదయం 11.07గంటలకు విడుద‌ల చేయ‌నున్నట్టు మేక‌ర్స్ ప్రక‌టించారు.

అయితే గ‌తంలో కేజీఎఫ్ చిత్రానికి పాట‌ల వ‌ల్ల ఎంత క్రేజ్ వ‌చ్చిందో అందరికీ తెలిసిందే. ఇక పార్ట్-2 చిత్రానికి కూడా అదే విధంగా పాట‌ల‌తో మంచి బ‌జ్ క్రియేట్ చేయాల‌ని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించగా, ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కీల‌క‌పాత్రలో న‌టించ‌నున్నాడు.

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన విషయం ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేదు. దీంతో ఆయన సినిమాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 సినిమాని నిర్మిస్తుండడంతో ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రం నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనాతో పాటు ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చి, చివరికి ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో పాటు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు కలిపి ఓవర్సీస్ డీల్ పూర్తి చేసినట్లు సమాచారం.