జబర్దస్త్ అవినాష్ బిగ్‌బాస్ 4 తెలుగు లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా జబర్దస్త్‌ను వీడి బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే నానా తంటాలు పడ్డాడని తెలుస్తోంది. మల్లెమాల వారి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించాకే బిగ్‌బాస్‌కు వెళ్లాలనే షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అందుకోసం అవినాష్ భారీగానే చెల్లించాడని తెలుస్తోంది. అయితే కాసేపు ఈ విషయం పక్కనపెడితే.. అవినాష్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఓ వ్యక్తి మాత్రం ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నాడని టాక్.
ఆ వ్యక్తి మరెవరో కాదు. జబర్దస్త్ అవినాస్ కో ఆర్టిస్ట్.. కో టీం లీడర్ కెవ్వు కార్తీక్. మామూలుగా జబర్దస్త్‌లో ఈ ఇద్దరు ఎన్నో స్కిట్స్ తరువాత టీం లీడర్స్‌గా ఎదిగారు. మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్‌గా బాగానే నవ్వించారు. ఎన్కోసార్లు స్కిట్స్ కొట్టారు. జడ్జ్‌లు సంతృప్తి చెందారు. అయితే ఇంత వరకు వీరి ప్రయాణం జంటగా బాగానే సాగింది. ఇద్దరూ కలిసి ఉండటంతో స్కిట్ కూడా బాగానే పండేది. ఎక్కువ పాళ్లు అవినాషే నవ్వించే ప్రయత్నం చేసేవాడు.
అయితే ఇక నుంచి కెవ్వు కార్తీక్ సోలో టీం లీడర్‌గా కొనసాగనున్నాడు. అవినాష్ అలా వెళ్లిపోవడంతో కార్తీక్‌కు ఇలా కలిసి వచ్చింది. తాజాగా తన స్కిట్‌లో ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. స్కిట్‌లో భాగంగా.. కార్తీక్ అన్న సోలోగా టీం లీడర్ అయ్యాడురా..సన్మానం చేద్దాం అంటూ ఇతర కంటెస్టెంట్లు రెడీ అయ్యారు. ఇప్పుడే ఎందుకురా ఇంకో నాలుగైదు ఎపిసోడ్లు అయిన తరువాత సన్మానం చేయొచ్చు కదరా అని కార్తీక్ చెబుతాడు. ఇక అంతలోనే రోజా అందుకుని.. అంత వరకు ఉంటావో లేదో అని.. అంటూ కౌంటర్ వేసేసింది. అంటే అవినాష్ లేకపోతే కార్తీక్ శూన్యమని ఆమె పరోక్షంగా చెప్పేసింది.