గాసిప్స్ : కీర్తిసురేష్ పెళ్ళైన తమిళ బిగ్ షాట్ తో రిలేషన్ లో?

ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమా దగ్గర ఉన్న యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ పేరు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. మరి ఇప్పుడు ఎన్నో సినిమాలు ఈమె చేస్తుండగా తెలుగులో అయితే లాస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన “సర్కారు వారి పాట” లో అయితే కనిపించింది.

మరి తెలుగులో ఆల్రెడీ చాలా మంది హీరోస్ తో సినిమాలు చేసేసిన ఈ హీరోయిన్ తమిళ్ లో కూడా విజయ్, విక్రమ్, రజినీకాంత్ లాంటి ఎంతోమంది బిగ్ స్టార్స్ సినిమాల్లో నటించింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమెపై కోలీవుడ్ సినీ వర్గాల్లో గాసిప్స్ ఐయే వినిపిస్తున్నాయి.

మరి ఆమె కొందరు ఫ్యాన్స్ కి ఇది మరింత షాకింగ్ గా ఉండొచ్చు కానీ ఈ రూమర్స్ మాత్రం ఆల్రెడీ పెళ్ళైన ఓ బిగ్ స్టార్ తో కీర్తి రిలేషన్ లో ఉంది అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో కూడా ఎవరో కాదట థలపతి విజయ్ అని అంటున్నారు. ఇది ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది కానీ ఈ షాకింగ్ రూమర్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అయితే విజయ్ కి ఆల్రెడీ పెళ్ళై వయసుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఈ రూమర్స్ మొదలయ్యాయి. అలాగే మరికొన్ని రోజులు కితమే విజయ్ విడాకులు అంటూ మరికొన్ని గాసిప్స్ స్ప్రెడ్ అయ్యాయి. మరి వీటిలో ఎంతవరకు నిజముందో కూడా కోలీవుడ్ వర్గాలు అయితే ఇవే చెప్తున్నాయి. మరి కీర్తి సురేష్ మరియు విజయ్ లు అయితే భైరవ, సర్కార్ లాంటి చిత్రాల్లో జంటగా నటించారు.