“RRR” ఆస్కార్ విషయంలో కీరవాణి పై కొన్ని విమర్శలు.!

MM-Keeravani_lead_1-2

ఈ ప్రైడ్ మూమెంట్ కోసం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో కూడా అర్ధం కాని పరిస్థితి. ఒకప్పుడు విలువ లేని తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ సినిమా దగ్గర భారత సినిమా పరిశ్రమ తాలూకా వెలుగు లా నిలిచింది. ఈ చలవ అంతా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాసివ్ హిట్ సినిమా “ఆర్ ఆర్ ఆర్” కే చెందుతుంది.

ఈ సినిమాలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి గాను ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం అయినటువంటి ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అలాగే రచయిత చంద్రబోస్ లకు దక్కింది. ప్రపంచ సినిమా దగ్గర భాష ను చేరిపేసి తెలుగు భాష తాలూకా ఖ్యాతిని చాటింది. అయితే ఇది మన తెలుగు వారికి ఎంత గర్వకారణం అనేది మాటల్లో చెప్పలేనిది.

కానీ నిన్న ఈవెంట్ విషయంలో కీరవాణి పట్ల కొందరు అసంతృప్తి గా ఉన్నారు. ఈ అవార్డ్ మన తెలుగు పలుకులకు తెలుగు నాటు స్వరానికి వచ్చింది. కాని అలాంటిది స్టేజ్ మీద తన స్పీచ్ కూడా తెలుగులోనే ఇచ్చి ఉంటే మన భాషకి మనం ఇచ్చే గౌరవం ఆ మహా వేదిక దగ్గర నుంచి తెలుగు వారు అందరికీ ఎంతో గర్వకారణం గా ఉండేది కదా అనుకుంటున్నారు కొందరు.

కాగా గతంలో రెహమాన్ కి ఆస్కార్ వచ్చినపుడు స్టేజి మీద తన మాతృ భాష తమిళం లోనే తన ప్రసంగాన్ని ఇచ్చి తన భాష పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పుకున్నాడని కొన్ని కామెంట్స్ కీరవాణి విషయంలో ఇప్పుడు తప్పలేదు.