హీరో పేరుతో దోచుకుంటున్న కేడి..రాఘవ లారెన్స్ పేరుతో ఇంత మోసమా?

తమిళ నటుడు రాఘవ లారెన్స్ మంచి నటుడు అలాగే డాన్సర్ కూడా. అతనికి తెలుగు, తమిళ స్టేట్ లలో మంచి క్రేజ్ ఉంది. తన హర్రర్ మూవీ సిరీస్ కు అందరూ అభిమానులే. అయితే రాఘవ లారెన్స్ సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎంతో మంచి మనిషి. అందరికీ సహాయం చేస్తూ ఎన్నో సంస్థలు నడుపుతున్నాడు. అయితే అతని పేరు వాడుకొని ఒక కేడి పేదలను దోచుకున్న సంఘటన చెన్నైలో ఎగ్మూర్ లో చోటుచేసుకుంది.

అతను రాఘవ లారెన్స్ దగ్గర పనిచేస్తున్నానని, రాఘవ లారెన్స్ ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు నీ కొడుకుకి పూర్తి విద్య ఉచితంగా రావాలంటే 8457 రూపాయలు జమ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి అని అతను కోరగా వీర రాఘవన్ అనే వ్యక్తి అతనిని నమ్మి ఆ డబ్బులని ఫోన్ పే చేశాడు. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ కాల్ రావడంతో అతని మాటలు నమ్మి 2875 రూపాయలు ఒకసారి తర్వాత 50 వేల రూపాయలను ఒకసారి పంపాడు.

తర్వాత అతనికి అనుమానం వచ్చి తిరిగి డబ్బులు ఇవ్వమని అడగగా ఆ కేడి రెస్పాండ్ అవ్వకుండా ఫోన్ ఆఫ్ చేశాడని వీర రాఘవన్ పేర్కొన్నాడు. ఇక విషయం అర్థం అయ్యి ఇతను ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దినేష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో నిజం బయటపడగా దినేష్ కుమార్ ని ఎగ్మూర్ కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి జైలుకి తరలించారు.

ఒక హీరో మంచితనాన్ని అవకాశం గా తీసుకొని ఇలాంటి పనులు చేస్తూ పేదల దగ్గర నుంచి డబ్బుని లాగడం ఈ మధ్య సాధారణ విషయం అయిపోతుంది. అందుకే పేరు తెలియని వారు వచ్చి డబ్బులు అడిగిన వెంటనే గుడ్డిగా నమ్మి ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఈ విషయం పైన పోలీసులు చాలా సీరియస్ అవ్వగా సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అయి అందరిని అలర్ట్ చేస్తుంది.