కత్తిలాంటి చీర కట్టింది కత్రీనా కైఫ్.. పసుపు రంగు చీరలో ఆమె జిల్మంటోంది. వెస్ట్రన్ వియర్ లో కేక పుట్టించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్ శారీలో క్యూటీ లుక్ ఇచ్చింది. క్లోతింగ్ బ్రాండ్ ర్యా మ్యాంగో కోసం కత్రీనా ఈ లుక్‌లో దర్శమనమిచ్చింది. ఎల్లో కలర్ శారీకి.. మెరిసే గోల్డన్ బోర్డర్ ఉంది. పసుపు రంగు చీర కోసం కైఫ్ తన బ్లౌజ్‌ను కూడా సేమ్ కలర్‌నే వేసుకుంది.
హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌కు తగినట్లే.. ఆమె తన హెయిర్‌స్టయిల్‌ను చార్మింగ్‌గా ప్రజెంట్ చేసింది. ఇక ఆమె జ్వలరీ కూడా స్పెషల్‌గా ఉంది. చెవిరింగులు, గాజులు కొత్త షేప్‌లో ఆకట్టుకుంటున్నాయి. మేకప్ కూడా మెస్మరైజింగ్‌గా ఉంది. పింక్ లిప్స్, బ్లాక్ ఐలైనర్, కనుబొమ్మలు, చిన్న ఎర్రని బొట్టుతో స్టన్నింగ్ లుక్ ఇస్తోంది కత్రీనా . ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి!!