అన్నమయ్య సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కస్తూరీ. భారతీయుడు సినిమాలోనూ కమల్ హాసన్ కూతురిగా నటించి మెప్పించింది. ఆకాశ వీధిలో అనే చిత్రంలోనూ నాగార్జున పక్కన నటించింది. సినిమా కెరీర్ ఎలా ఉన్నా గానీ ప్రస్తుతం బుల్లితెరపై బాగానే క్రేజ్ తెచ్చుకుంది. గృహలక్ష్మీ అనే సీరియల్‌తో బాగానే ఫేమస్ అవుతోంది. అంతకు మించి సోషల్ మీడియాలో మరో లెవెల్‌లో ఫేమస్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే కస్తూరీ.. ఎక్కడ ఏం జరిగినా సరే స్పందిస్తూ ఉంటుంది. తనదైన శైలిలో సెటైర్లు వేస్తూనే ఉంటుంది. తమిళ రాజకీయాలు, తమిళ సినిమాలు, కోలీవుడ్ గురించి ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతుంది. గత కొన్నినెలలుగా వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి విషయంపై కస్తూరీ స్పందిస్తూనే ఉంది. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. ఇక వనిత మూడో పెళ్లి కూడా పెటాకులు అయ్యేట్టు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంలో తన జీవితాన్ని కొందరు రోడ్డుకు ఈడ్చారని పరోక్షంగా కస్తూరిపై సెటైర్లు వేసింది. ఎవ్వరూ రోడ్డుకు ఈడ్చలేదు ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నువ్వే బజారున పడ్డావని కస్తూరీ ఫైర్ అయింది. తాజాగా ఓ నెటిజన్ ఇలాంటి ఓ ప్రశ్ననే అడిగాడు. సెలెబ్రిటీలందరూ తమ భర్త, భార్యల వివరాలను బయటకు ఎందుకు చెప్పరని ప్రశ్నించాడు. దానికి కస్తూరీ ఓ లెవెల్‌లో ఇచ్చి పడేసింది. మా పర్సనల్ విషయాలు, భర్త విషయాలు మీకెందుకు చెప్పాలి.. అవన్నీ సేకరించి రేషన్ కార్డ్ ఇస్తారా మీరు.. మీకెందుకు చెప్పాలి.. మీరు మా పిల్లలను కూడా తిడుతున్నప్పుడు మా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పాల్సిన పనిలేదంటూ ఫైర్ అయింది.