కార్తీకదీపం షూటింగ్ గ్యాప్‌లో అలా చేస్తాడట.. డాక్టర్ బాబు మామూలోడు కాదు!!

Karthika Deepam Fame Sahruda ABout Nirupam

కార్తీకదీపం సీరియల్ గురించి, అందులోని పాత్రల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరు. కార్తీకదీపంలో సీరియల్‌లోని అన్ని పాత్రలు ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి. అందులో మరీ ముఖ్యంగా కార్తీక్ డాక్టర్ బాబుగా నిరుపమ్.. వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్‌లకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. అలానే హిమ, శౌర్య పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఆ క్యారెక్టర్స్ పోషిస్తోన్న బాల నటులు కృతిక, సహృదలకు భారీ ఫాలోయింగ్ వచ్చింది.

Karthika Deepam Fame Sahruda ABout Nirupam
Karthika Deepam Fame Sahruda ABout Nirupam

ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌లు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. శౌర్య ఫేమ్ కృతిక.. తెరపై గంభీరంగా కనిపిస్తుంది.. కానీ రియల్ లైఫ్‌లో కాస్త సాఫ్ట్‌గా కనిపిస్తోంది. హిమ పాత్రలో సహ‌ృద తెరపై చాలా అమాయకంగా నటిస్తుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం హుషారు పిల్ల. ఆమె వేసే డ్యాన్సులు, చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే షూటింగ్ గ్యాప్‌లో డాక్టర్ బాబు హిమను దారుణంగా ఏడిపిస్తాడట. నిరుపమ్ తెర వెనుకలా ఎంత సరదాగా ఉంటాడో తాజాగా చెప్పుకొచ్చింది.

సీరియల్ యాక్టర్ ప్రభాకర్ భార్య మలయజ యూట్యూబా చానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిరుపమ్, సహృదను ఇంటర్వ్యూ చేసింది. అందులో సహృద ఎన్నో విషయాలను చెప్పింది. మొదటగా నిరుపమ్‌ను అన్నయ్య అని పిలిచిందట. కానీ అంకుల్ అని పిలవాలని అనిపించిందట. షూటింగ్ గ్యాప్‌లో తనను బాగా ఏడిపిస్తాడని, కోతి అంటూ పిలుస్తాడని నిరుపమ్ గురించి సహృద కంప్లైంట్ చేసింది. మొత్తానికి డాక్టర్ బాబు సెట్‌లో ఫన్నీగా ఉంటాడన్న మాట.