ఓరీ దేవుడా ఇలా షాక్ ఇచ్చేసిందేంటి?.. ‘కార్తీక దీపం’ ఫేమ్ హిమ రచ్చ!

హాలీవుడ్ సూపర్ హీరోలు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్, కార్టూన్‌లో టామ్ అండ్ జెర్రీ డోరేమాన్ తెలియని వాళ్లెవరూ ఉండరు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి అందులో దీప అలియాస్ వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్), డాక్టర్ బాబు అలియాన్ కార్తీక్ (నిరుపమ్), శౌర్య (కృతిక), హిమ (సహృద) తెలియని వారెవ్వరూ ఉండరు. మరీ ముఖ్యంగా ఈ సీరియల్ బుల్లితెరపై సృష్టించే సంచలనాలకు పెద్ద పెద్ద చానెళ్లు కూడా నివ్వెరబోతాయి.

karthika deepam Fame hima Sahruda Dance Video Goes Viral
karthika deepam Fame hima Sahruda Dance Video Goes Viral

అయితే ఈ సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్, సహృదలకు మేకప్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్లను కావాలనే పాత్రలకు తగ్గట్టుగా నల్లగా ఉండాలని ఆ విధంగా మేకప్ వేస్తుంటారు. కానీ బయట మాత్రం వారు అలా ఉండరు. నిజంగా వారిని బయట చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా హిమ పాత్ర కాస్త డిఫరెంట్. శౌర్య అంత రఫ్ అండ్ టఫ్‌గా ఉండదు. అమాయకంగా ఉంటుంది హిమ పాత్ర.

సీరియల్ వరకు హిమ క్యారెక్టర్ పోషించే సహృద సైలెంట్ ఏమో గానీ ఒక్కసారి ఆమె సోషల్ మీడియా ఖాతాను పరిశీలిస్తే ఆ పాప సంగతి తెలుస్తుంది. డ్యాన్సులతో అదరగొట్టేసి అందర్నీ అవ్వాక్కయ్యేలా చేస్తోంది. ఇక హిమ ఎంత అందంగా ఉంటుందో తెలియాలంటే కచ్చితంగా ఆమె సోషల్ మీడియా ఖాతాను చూడాల్సిందే. తాజాగా ఆమె రౌడీ బేబీ, ముక్కాలా, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోని మైనా మైనా అనే పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసేసింది.