RRR: ఆర్ఆర్ఆర్ కు సీఎం హాజరవుతున్నారా.. ఇందులో నిజమెంత?

RRR:రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం చాలా ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు. జక్కన్న సినిమా పై హైప్ పెంచడానికి కాను విడుదల చేసిన ఎత్తర జెండా..పాట తో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాడు.

ప్రమోషన్ లో భాగంగా అనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను మార్చి 19న కర్ణాటక లోని చిక్కబల్లపూర్ నిర్వహిస్తున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేశారు.అంతే కాకుండా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాటక ముఖ్యమంత్రి అయిన బసవరాజు బొమ్మై కూడా వస్తున్నాడంట. ఇంకా ఆరోగ్య శాఖ మంత్రి, పునీత్ రాజ్ కుమార్ గారి సోదరుడు అయిన సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా హాజరవుతున్నారు అట.

కర్ణాటకలో ఎన్టీఆర్ చరణ్ కు అభిమానులు కూడా ఎక్కువగా ఉండటం వలన,ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ను నిర్వహిస్తే అభిమానులను కంట్రోల్ చేయడం చాలా కష్టం అని భావించిన రాజమౌళి..  ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని చిక్కబల్లాపూర్ లో ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నారట.రెండు రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వహంచినట్టు ఉంటుందని జక్కన్న ప్లాన్ వేస్తున్నాడంట.