గ‌ర్భంతోనే షూటింగ్‌లో పాల్గొంటున్న స్టార్ హీరోయిన్.. అవాక్క‌వుతున్న ఆడియ‌న్స్

కొంద‌రికి ప‌నిపై ఏకాగ్ర‌త ఎంత‌లా ఉంటుందంటే వ‌ర్క్ పూర్తయ్యేవ‌ర‌కు నిద్రాహారాలు కూడా మానేస్తారు. మ‌రికొంద‌రు ఎలాంటి పరిస్థితుల‌లో ఉన్న ఒప్పుకున్న ప‌నిని పూర్తి చేస్తారు. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది స్టార్స్ డెడికేష‌న్‌తో ప‌ని చేస్తారు. నిర్మాత‌లు భారీ ఇంట్రెస్ట్‌ల‌తో అప్పులు తెచ్చి సినిమాలు చేస్తుంటారు. ఒక్క‌రి వ‌లన షూటింగ్ ఆగిన కూడా నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాలు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో ఒప్పుకున్న ప‌నిని స‌కాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటారు.

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రెండోసారి తల్లి కాబోతున్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆగస్టులోనే తాను గర్భవతిని అంటూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న‌ కరీనా కపూర్ ఖాన్ తన బేబీ బంప్ చూపించుకోడానికి ఏ మాత్రం మొహమాటపడట్లేదు.గ‌ర్భంతోనే ఇంటా, బ‌య‌టా తిరుగుతూ కెమెరాల‌కు ఫోజిస్తుంది. ఇటీవ‌ల ఢిల్లీలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా షూటింగ్‌లో పాల్గొన్న క‌రీనా, తాజాగా ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంది. బేబీ బంప్‌తోనే షూటింగ్‌లో పాల్గొన్న క‌రీనాతో పాటు తన అక్క కరిష్మా కపూర్ కూడా షూటింగ్‌కు హాజరైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

కరీనా ప్ర‌స్తుతం గర్భవతి కావడంతో తన పార్ట్ ముందుగానే పూర్తి చేయాలని సూచించింది బెబో. దాంతో దర్శకుడు కూడా అదే చేసాడు. ప్ర‌స్తుతం కరీనా ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి కాగా, త్వ‌ర‌లోనే పండంటి బేబీకు జ‌న్మ‌నివ్వ‌నుంది. ఫిబ్రవరిలో సైఫ్, కరీనా జంటకు రెండో బిడ్డ పుట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే సైఫ్ దంప‌తుల‌కు తైమూర్ అనే బుడ‌త‌డు ఉన్న సంగ‌తి తెలిసిందే. చిన్న వ‌య‌స్సులోనే ఈ చిన్నారి చాలా పాపుల‌ర్ అయ్యాడు. ఇక కరీనా .. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో మాత్రమే నటిస్తుంది. ఈ చిత్రం 2021 క్రిస్మస్‌కు విడుదల కానుంది. గ‌ర్భ‌వ‌తిగా ఉన్నందున ఏ సినిమాల‌కు సైన్ చేయ‌డం లేదు.