బాబీ అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో అలా ముద్ర వేసింది కరాటే కళ్యాణి. వ్యాంప్ క్యారెక్టర్స్ చేయడంతో తనదైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే తెరపై వేషాలు మాత్రమే అలా వేస్తానని, నిజ జీవితంలో అలాంటి దాన్ని కాదు తాను ఏంటో నిరూపించుకునేందుకే బిగ్ బాస్ షోకి వచ్చానని కరాటే కళ్యాణి తెలిపింది. అయితే అరుపులు, పెడబొబ్బులతో మొదటి వారం నానా రచ్చ చేయడంతో రెండో వారం ఇంటికి పంపించారు.
కరాటే కళ్యాణికి ఓ తీరని కోరిక ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. సీమంంతం చేసుకోవాలని.. తన గర్భాన్ని తాను చూసుకోవాలని.. పెళ్లి చేసుకున్న ప్రతీసారి గర్భం రావడం పోవడం జరిగిందని.. కానీ తన కోరిక తీరలేదని చెబుతూ అందర్నీ ఏడిపించేసింది. తనకు నిజమైన ప్రేమ దొరకలేదని, అందరూ తనను వాడుకున్నారని కరాటే కళ్యాణి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏవీలో చెప్పిన సంగతులు అందర్నీ ఏడిపించేశాయి.
అయితే తాజాగా పెళ్లి, పిల్లలు, డేటింగ్ వంటివాటిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. భవిష్యత్‌లో పెళ్లి చేసుకుంటానేమో.. లేదంటే సహజీవనం చేసైనా పిల్లల్ని కనొచ్చని తెలిపింది. మొదట్లో పిల్లల్ని కనేందుకు కొన్ని సమస్యలు వచ్చినా.. తరువాత అలాంటివి రాలేదని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని.. అన్ని టెస్ట్‌లు చేయించుకున్నానని తెలిపింది. మరి ఆమె కోరిక తీరుతుందో లేదో చూడాలి.