కరాటే కళ్యాణి మీద ఓవరాక్షనా.?

రాముడంటే, కృష్ణుడంటే.. ఎన్టీవోడు మాత్రమే.. తెలుగునాట సినీ అభిమానులు చెప్పే మాట ఇది. కానీ, ఇళ్ళల్లో దేవుడి ఫొటోల్లో ఎన్టీయార్ వుండడు కదా. సినిమా వేరు.. నిజం వేరు.! కృష్ణుడి గెటప్‌లో ఎన్టీయార్ విగ్రహాల్ని బలవంతంగా జనం మీద రుద్దుతున్నారన్న విమర్శలొస్తున్నాయ్. ఇదెక్కడి పంచాయితీ.? అంటూ సినీ నటి కరాటే కళ్యాణి మండిపడింది.

ఆమె రైజ్ చేసిన పాయింట్ కరెక్టే కానీ, ఇదే పాయింట్‌ని సీరియస్‌గా తీసుకున్నాడు మంచు విష్ణు వర్ధన్ రెడ్డి. అదేంటీ.? ఆయనకేం సంబంధం.? అంటారా.! అవును మరి, ఆయన ‘మా’ అధ్యక్షుడు కదా. ఆ హోదాతోనే ఏకంగా కరాటే కళ్యాణికి మంచు విష్ణు షోకాజ్ నోటీసులు పంపేశాడు. హవ్వ ఎంత కామెడీ.?

‘మా’ అధ్యక్షుడిగా సినీ పరిశ్రమలో తేల్చాల్సిన లెక్కలు, తీర్చాల్సిన బాధ్యతలూ చాలానే వుండగా, కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు ఆయన వద్దకు చేరిపోవడం.. ఆ సాకుతో ఆమెకి షోకాజ్ నోటీసులు పంపించడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. కామెడీ చేయడానికింకేటీ దొరకలేదా.? అని సెటైర్లు వేసుకుంటున్నారు.

అలాగే, సినీ ఇండస్ర్టీలో సీరియస్ ఇష్యూస్ పేరు చెప్పి, బండ బూతులు తిట్టుకుంటున్న సినీ ప్రముఖులకి ఏనాడైనా నోటీసులిచ్చాడా మంచు విష్ణు.? అల్ప ప్రాణం కదా.. అందుకే, కరాటే కళ్యాణికి నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.