కరాటే కళ్యాణి పోరాటం ఆగేలా లేదుగా.. ఆ యూట్యూబర్స్ అందరిపై ఎఫ్ఐఆర్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్, సినీ నటి అయిన కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఇక ఇటీవలే కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత కరాటే కళ్యాణి మరింత పాపులర్ అవడమే కాకుండా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలోనే ఆ తర్వాత చిన్నారి దత్తత ఇష్యూ పై కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణలో భాగంగా హాజరయ్యి క్లీన్ చిట్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అప్పుడు ఆమె తనను వేధించిన ఎవరినీ వదిలిపెట్టనని చెప్పిన కళ్యాణి ఆ దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలోనే అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 యూట్యూబ్ ఛానెల్స్‌పై కరాటే కళ్యాణి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలతో సహా ఆమె పోలీసులకు సమర్పించారు. ఈమేరకు సీసీఎస్ పోలీసులు ఐటీ యాక్ట్‌లోని 67A,509 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూట్యూబ్ ఛానల్స్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు.

మరోవైపు ఇప్పటికే పోలీసులు ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌పై నిఘా ఉంచడమే కాకుండా కళ్యాణి సాక్ష్యాలతో సహా ఇచ్చిన 20 యూట్యూబ్ ఛానెల్స్‌పై విచారణ చేపట్టేందుకు పోలీసులు ఒక ప్రత్యేక టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టీమ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. మొత్తానికి కరాటే కళ్యాణి వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇక ఇటీవల కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి నిలదీస్తూ ఈ క్రమంలోనే చేయి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు శ్రీకాంత్ రెడ్డి కూడా ఏ మాత్రం తగ్గకుండా కరాటే కళ్యాణి పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరాటే కళ్యాణి శ్రీకాంత్ రోడ్డు పై పరిగెత్తించి మరి కొట్టింది.