నెత్తుటితో తడిచిన దేహం.. ‘కాంతారా’ ప్రీక్వెల్‌ ప్రారంభం…

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కాంతారా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఓ సినిమా సిద్థమవుతోన్న విషయం తెలిసిందే.

సోమవారం ఈ చిత్రం టైటిల్‌ విడుదల చేశారు. ‘కాంతారా ఏ లెజెండ్‌’ అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు..’ అంటూ రిషబ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. నెత్తుటితో తడిచిన దేహం, ఆవేశం నిండిన చూపు, పొడవాటి జుట్టుతో రిషబ్‌ లుక్‌ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. .ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2022లో విడుదల అయిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లను సాధించింది.

కర్ణాటకలో ‘కేజీయఫ్‌: ఛాప్టర్‌ 2’ని మించిన వసూళ్లను సాధించి ఇండస్టీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీని రెండో భాగాన్ని ‘కాంతార: ఛాప్టర్‌ 1’ పేరిట తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఏడు భాషల్లో ఈ సినిమాని మేకర్స్‌ విడుదల చేయనున్నారు. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్‌, బెంగాలీ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్‌ 1’ విడుదల కానుంది.