లేటెస్ట్ : “కాంతారా 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

గత ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ అయ్యిన చిత్రాల్లో నార్మల్ రిలీజ్ గా వచ్చి అద్భుతమైన క్లైమాక్స్ అంటూ తెలుగులో ఓ రేంజ్ లో హైప్ ని డబ్బింగ్ వెర్షన్ రాక ముందే అందుకున్న సినిమా “కాంతారా”. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తానే దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు కన్నడ హిందీ భాషల్లో మాసివ్ హిట్ అయ్యి ఏకంగా 400 కోట్ల గ్రాసర్ గా నిలిచింది.

కాగా ఈ సినిమా సీక్వెల్ ని కూడా మేకర్స్ ఆ మధ్య అనౌన్స్ చేయడంతో దానిపై భారీ హైప్ నెలకొంది. కాగా ఈ సినిమాని ప్రీక్వెల్ గా చేస్తున్నట్టుగా తాము తెలిపారు. ఇక ఈరోజు ఉగాది కానుకగా అయితే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు మాసివ్ అప్డేట్ ని అందించారు.

ఈ ఉగాది సందర్భంగా అయితే తాము సినిమా రచన పనులు స్టార్ట్ చేశామని ఈ సారి సినిమా కథ మనుషులకి మరియు ప్రకృతికి ఉండే అనుబంధాన్ని చూపించేలా ఉంటుంది అని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని ఐతే రివీల్ చేశారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాకి కూడా రిషబ్ శెట్టి నే దర్శకత్వం వహించనుండగా అజనీశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్టుగా ప్లాన్ లు చేస్తున్నారు.