గత ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన కొన్ని చిత్రాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక సెన్సేషన్ ని నమోదు చేసిన సినిమా “కాంతారా ఏ లెజెండ్” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించగా తానే ఈ సినిమాకి దర్శత్వం కూడా వహించడం విశేషం.
కాగా ఈ సినిమా అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయ్యి కన్నడ సినిమాలో మరో 400 కోట్ల గ్రాసర్ గా నిలవగా దీని తర్వాత పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇది స్టార్ట్ చేయడానికి సమయం తీసుకుంటారు అని చాలా మంది అనుకున్నారు కానీ మేకర్స్ ఎక్కువ సమయం తీసుకోకుండానే అప్డేట్ అందించారు.
రిషబ్ శెట్టి సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ ని లాక్ చేసేసాడు. అయితే షూటింగ్ కి కొంత సమయం తీసుకొని స్టార్ట్ చేస్తుండగా ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం వైరల్ గా మారింది. ఈ సినిమాని కొనసాగింపు సినిమాగా కాకుండా ముందు జరిగే కథగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
కాగా ఇది ఎంత ముందు ఎంత పూర్వ కాలంలో సినిమా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి పూర్వ కాలం 300 – 400 సంవత్సర నేపథ్యంలో రాసుకున్నాడట. దీనితో కాంతారా 2 అనుకున్న దానికంటే కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ సినిమా షూటింగ్ అయితే డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుండగా వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఏడాదిలో రిలీజ్ కావచ్చని తెలుస్తుంది.