ఈసారి “సైమా అవార్డ్స్ 2023” తెలుగు సినిమా మొత్తం లిస్ట్ వివరాలు 

ఇపుడు టాలీవుడ్ సినిమా సహా సౌత్ ఇండియా సినిమా అన్ని సినీ ఇండస్ట్రీస్ లో బాగా వినిపిస్తున్న ప్రముఖ అవార్డ్స్ పేరే సైమా అవార్డ్స్ 2023. కాగా ఈ అవార్డ్స్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ పేరిట ఓ ఆర్గనైజేషన్ నిర్వహించగా. ఈసారి అయితే గత 2022 ఏడాదిలో వచ్చిన చిత్రాలకి గాను పలు విభాగాల్లో అవార్డుల్ని అందించారు.

మరి ఈసారి ఈ అవార్డు వేడుకలు దుబాయ్ లో జరగగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, కన్నడ స్టార్ నటుడు యష్ నిర్మాత అశ్వని దత్, హీరోయిన్స్ మృణాల్ ఠాకూర్, శృతి హాసన్, నిర్మాత అల్లు అరవింద్ ఇలా ఎందరో దిగ్గజాలు హాజరు కాగా ఇప్పుడు టాలీవుడ్ సినిమాకి సంబంధించి భారీ మొత్తంలో 22 అవార్డులు అనేక విభాగాల్లో అనేకమందికి వరించాయి. కాగా ఇపుడు ఈ టోటల్ లిస్ట్ ప్రకారం డీటెయిల్స్ చూస్తే.. 

1. ఉత్తమ చిత్రం : సీతారామం(వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్)2. మెయిన్ లీడ్ నటుడు : జూ. ఎన్టీఆర్ (RRR)
3. ఉత్తమ నటుడు(సినీ క్రిటిక్స్ ఛాయిస్): అడివి శేష్ (మేజర్)
4. ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
5. ఉత్తమ నటి(క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
6. ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR)
7. సహాయ పాత్రలో ఉత్తమ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్ల ఎన్
8. సహాయ పాత్రలో ఉత్తమ నటి: సంగీత (మసూద)
9. ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి (RRR)
10. ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ RRR (నాటు నాటు)
11. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (పురుషుడు) : రామ్ మిర్యాల డిజె టిల్లు (డిజె టిల్లు)
12 ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (స్త్రీ): మంగ్లీ జింతాక్ (ధమాకా)
13. ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు: సుహాస్ (హిట్-2)
14. మొదటి చిత్రం ఉత్తమ నటుడు : అశోక్ గల్లా (హీరో)
15. బెస్ట్ ప్రామిసింగ్ కొత్త నటుడు : బెల్లంకొండ గణేష్
16. ఉత్తమ తొలి నటి: మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
17. బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్: వసిష్ఠ (బింబిసార)
18. బెస్ట్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్: శరత్ & అనురాగ్ (మేజర్)
19. ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ (RRR)
20. బెస్ట్ కమెడియన్ : శ్రీనివాస్రెడ్డి (కార్తికేయ 2)
21. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్ : శృతి హాసన్
22. సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ : కార్తికేయ 2