క్రేజీ అప్డేట్ : “కాంతారా 2” కాదు పార్ట్ 1 ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది.. 

గత ఏడాదిలో ఇండియన్ సినిమాని షేక్ చేసిన పలు చిత్రాల్లో కన్నడ సినిమా నుంచి వచ్చిన సెన్సేషనల్ చిత్రం కాంతారా కూడా ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించి తెరకెక్కించిన ఈ సినిమా మొదటగా కన్నడలో అనేక సంచలనాలు సృష్టించి తెలుగు సహా హిందీలో కూడా 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని భారీ హిట్ అయ్యింది.

దీనితో దీని తర్వాత రెండో భాగాన్ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయగా దానిపై మరిన్ని అంచనాలు అయితే నెలకొన్నాయి. కాగా ఇప్పుడు ఈ రెండో భాగానికి సంబంధించి ఓ లేటెస్ట్ క్రేజీ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. దీనితో ఈ సినిమాని పార్ట్ కాకుండా పార్ట్ 1 అంటూ అనౌన్స్ చేశారు.

ఇది వరకే ఈ రెండో సినిమా సీక్వెల్ లా కాకుండా ప్రీక్వెల్ గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పార్ట్ 1ఫస్ట్ లుక్ ని కూడా అప్పుడే రిలీజ్ చేసేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. ఈ నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తున్నట్టుగా హీరో రిషబ్ శెట్టి మాసివ్ అప్డేట్ ఇప్పుడు అందించాడు.

దీనితో ఈ ఫస్ట్ లుక్ పట్ల ఇపుడు మరింత హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాని మొదటి భాగం కంటే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా ఈ డిసెంబర్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారని సినీ వర్గాలు చెప్తున్నాయి.